వనపర్తి/గోపాల్‌పేట/పెబ్బేరు : అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ‘అరైవ్ అలైవ్’ లాంటి రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. గురువారం గోపాల్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ, బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్న పొలికేపాడు సర్పంచ్ బంగారయ్యను సన్మానించారు. గోపాల్‌పేట మండలంలో రూ. 30.02 కోట్ల రుణమాఫీ, రూ. 13.96 కోట్ల రైతు భరోసా అందించామని, కొత్తగా 962 రేషన్ కార్డులు జారీ చేశామని వివరించారు. మండలంలో 408 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఖరీఫ్ పంట కొనుగోలు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. బ్బేరు మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక, 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా పెబ్బేరు నియోజకవర్గంగా మారే చాన్స్ ఉందన్నారు.

